Anukoni Athidhi : ‘ఆహా’ లో ‘అనుకోని అతిథి’ గా ‘అథిరన్’..
వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది..
- sekhar
- Published On : May 19, 2021 / 02:17 PM IST
Anukoni Athidhi
Anukoni Athidhi: వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ మూవీని తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.. విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
In The Name of God : ‘ఆహా’ లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఒరిజినల్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’..
మే 28 నుండి ‘ఆహా’ లో ‘అనుకోని అతిథి’ ప్రీమియర్ కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతికృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రాన్, మ్యూజిక్: పిఎస్ జయహరి.
