వైరల్ అవుతున్న అనుష్క శర్మ కమర్షియల్ యాడ్..
- sekhar
- Published On : December 16, 2020 / 01:44 PM IST
Anushka Sharma: విరుష్క దంపతులు త్వరలో తమ జీవితంలోకి కొత్త మెంబర్‌ని ఆహ్వానించబోతున్నారు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భంతో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ జనవరి మొదటి వారంలో ఓ బేబికి జన్మనివ్వబోతున్నారు.
ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలోనూ.. ఇంటి పనులు చేసుకోవడంతో పాటు యోగా సెషల్‌లోనూ పాల్గొంటూ.. గర్భధారణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. వీలైనంత సంతోషంగా, బిజీగా ఉంటేనే మంచిదంటూ మహిళలకు సూచనలిస్తున్నారామె. అంతేకాదు గర్భవతిగా ఉన్న ఈ సమయంలో ఓ కమర్షియల్ యాడ్‌లో కూడా నటించారు అనుష్క.
పాపులర్ ప్రెగ్నెన్సీ కిట్ ప్రెగా న్యూస్ కోసం అనుష్క చేసిన కమర్షియల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రెగా న్యూస్ కమర్షియల్‌లో అనుష్క చక్కని చిరునవ్వు, హావభావాలతో ఆకట్టుకున్నారు. ‘ఈ యాడ్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది.. ప్రెగా న్యూస్‌తో నా ప్రెగ్నెన్సీ జర్నీ’.. అంటూ వీడియో షేర్ చేశారు అనుష్క శర్మ.
