10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది.
జులై-10న ఫస్ట్ లాంగ్వేజ్,11న సెకండ్ లాంగ్వేజ్,12న ఇంగ్లీష్, 13న మ్యాథ్స్,14న సైన్స్,15న సోషల్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నాం 12:45గంటల వరకు పరీక్ష ఉంటుంది. భౌతిక దూరం పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఆలస్యమైన విషయం తెలిసిందే.
Read Here>> 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఏపీ ప్రభుత్వం జీవో