ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు ఎక్సైజ్ సిబ్బంది బదిలీ… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం  

  • Publish Date - May 15, 2020 / 06:31 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, ఇసుక అక్రమ  రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కువ శాతం ఎక్సైజ్ సిబ్బందిని ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు బదిలీ చేశారు. మొత్తం 6 వేల 274 పోస్టుల్లో 70 శాతం పోస్టులను ఎస్ ఈబీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ఎక్సైజ్ శాఖలో 1881 పోస్టులు, మిగిలిన 4393 పోస్టులు ఎస్ ఈబీకి బదిలీ చేశారు. మద్యానికి సంబంధించిన రైడ్స్, ఎఫ్ ఐఆర్ అధికారాలను ఎస్ ఈబీకి అప్పగించారు. రాష్ట్రంలోని 208 ప్రాహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ ఈబీకి అటాచ్ చేసింది.

Read Here>> ఏపీలో మరో 57 కరోనా కేసులు