AP Covid Update : ఏపీలో కొత్తగా 71 కోవిడ్ కేసులు

ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా 71 కోవిడ్ కేసులు నమోదయ్యయని కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కో

Ap Covid Up Date

AP Covid Update : ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా 71 కోవిడ్ కేసులు నమోదయ్యయని కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య 23,17,812 కి చేరింది.

కోవిడ్ వల్ల నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కోవిడ్ తో రాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 14,727 కి చేరింది. నిన్న 595 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,00,760కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,325 యాక్టివ్ కేసులు ఉన్నాయని కోవిడ్ నియంత్రణా విభాగం పేర్కోంది.

Andhra Pradesh Covid Up Date