AP PRC : ఛలో విజయవాడ సక్సెస్.. చర్చలకు రావాలంటున్న సర్కార్

సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.

AP PRC Fight : చలో విజయవాడ సక్సెస్‌పై ఉద్యోగ సంఘాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. అయితే.. మరోసారి చర్చలకు రమ్మంటోంది ఏపీ ప్రభుత్వం. చర్చలకు రావాలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు సీఎస్‌ సమీర్‌ శర్మ ఆఫర్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు సమీర్‌శర్మ. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో ఉద్యోగ నేతలు చర్చలకు రావాలని కోరారు. ఉద్యోగులకు తమపై కోపం ఉంటే వచ్చి మాట్లాడవచ్చన్నారు. అంతేకానీ… చర్చలకు రాకుండా ఉంటే పరిష్కారం ఎలా అవుతుందన్నారు సీఎస్‌.

Read More : Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

ఇక సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. దీంతో 2022, ఫిబ్రవరి 04వ తేదీ శుక్రవారం స్టీరింగ్ కమిటీలో చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ అయ్యాయి. మరోవైపు చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అడుగడుగునా పోలీసులు మోహరించినా.. ఎక్కడికక్కడ అరెస్టు చేసినా… ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు.

Read More : Statue Of Equality : రేపు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోది

ఓ ఉప్పెనలా బెజవాడకు చేరుకున్నారు. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి నిలబడి గట్టిగానే తమ నిరసన తెలియజేశారు. నోటీసులనూ లెక్క చేయలేదు.
ఇటీవలే మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని చెప్పింది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ట్రెండింగ్ వార్తలు