Ap Records Nearly Two Thousand Corona Cases
AP Corona : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దాదాపు 2వేల కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 657 శాంపిల్స్ పరీక్షించగా.. 1,941 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,10,943 కు చేరింది.
వీరిలో 8లక్షల 91వేల 883 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 11వేల 809 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో ఆరుగురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7వేల 251కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 835మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(ఏప్రిల్ 6,2021) బులెటిన్ విడుదల చేసింది.