Apple Employees : ఆపిల్ ఉద్యోగులకు కొత్త ఆప్షన్.. ఇకపై మాస్క్‌లు లేకుండానే ఆఫీసులకు రావొచ్చు!

కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. నెమ్మదిగా సాధారణ పరిస్థితికి వస్తోంది. ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టెక్ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు.

Apple Employees : కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. నెమ్మదిగా సాధారణ పరిస్థితికి వస్తోంది. ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టెక్ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. టెక్ దిగ్గజ కంపెనీలు కూడా కొవిడ్ నిబంధనల విషయంలో ఆంక్షలను సడలిస్తున్నాయి. చాలా వరకూ టెక్ కంపెనీలు మాస్క్ లేకుండానే ఉద్యోగులను ఆఫీసులకు అనుమతిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఆపిల్ ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరి నిబంధననలు ఎత్తివేసింది. ఇకపై ఆఫీసుల్లో ఉద్యోగులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కుపెర్టినో దిగ్గజం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపిల్ తన ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపింది. మాస్క్ లేకుండా సురక్షితంగా భావించని వారు తప్పక ధరించాల్సి ఉంటుంది. మీకు క్షేమంగా ఉండాలంటే ఫేస్ మాస్క్ ధరించాలని ఆపిల్ పేర్కొంది.

Apple says employees can now roam around its offices without masks

ఇటీవలే, కోవిడ్-19 అత్యంత ప్రమాదకర (BA.5) వేరియంట్‌ ప్రభావం తగ్గింది. దాంతో ఆపిల్ ఉద్యోగులకు మాస్క్‌లు ధరించే ఆప్షన్ తీసుకొచ్చింది. బే ఏరియా ట్రాన్సిట్ సిస్టమ్ BART తిరిగి తీసుకురానుందని తెలిపింది. అదనంగా, లూయిస్‌విల్లేలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాస్క్ ఆదేశాలు కూడా తిరిగి వచ్చాయి. ఆపిల్ సంబంధిత అన్నీ కంపెనీల్లో మాస్క్ తప్పనిసరి అనేది వర్తించదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. చాలా ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం లేదు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చాలా ముఖ్యమని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Apple Watch : ఈ ఆపిల్ వాచ్.. మీ హార్ట్‌బీట్‌లో తేడా ఉన్నా చెప్పేస్తుంది.. డెడ్లీ ట్యూమర్లను పసిగట్టేస్తుంది!

ట్రెండింగ్ వార్తలు