Approved By The Governor For 4 Nominated Mlc Posts
Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాకింద ఈ నలుగురు నియామకం కాగా సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమంతకమణికి జూన్ 11తో పదవీ కాలం ముగియగా వీరి స్థానంలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు.
గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఈ సభ్యులకు సాధారణంగా అధికార పార్టీకి చెందిన వారికే అవకాశం ఉండగా వైసీపీ అధిష్టానం మూడు రోజుల క్రితమే సభ్యులను ఎంపిక చేసి లిస్ట్ రాజ్ భవన్ కు పంపగా గవర్నర్ నేడు ఆమోదించారు. ఇందులో మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లు ప్రతిపాదించగా గవర్నర్ నలుగురిని ఎమ్మెల్సీలుగా నియమితులైనట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
కాగా, మరో ఒకటి రెండు రోజుల్లో వీరి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇందులో మోషేన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన నేత కాగా, తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ నుండి వైసీపీలో చేరిన కాపు వర్గానికి చెందిన నేత, ఇక రాయలసీమ నుండి బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పేర్లను సామజిక వర్గాల సమతుల్యతతో ఎంపిక చేసినట్లుగా కనిపిస్తుంది.