Delhi liquor excise case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకపరిణామం .. అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త..ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడు అయిన దినేశ్ అరోరా అప్రూవర్ గా మారారు. దీంతో దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

Approver turned businessman Dinesh Arora in Delhi liquor excise case

Delhi liquor excise case :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త..ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడు అయిన దినేశ్ అరోరా అప్రూవర్ గా మారారు. దీంతో దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈకేసులో దినేశ్ అరోరా అప్రూవర్ గా మారారని..ఆయన తెలిపే కీలక విషయాలు ఈకేసు పరిష్కారానికి కీలకం కానున్నాయని పిటీషన్ లో పేర్రొంది సీబీఐ. ఈక్రమంలో కోర్టు ఈరోజు దీని గురించి విచారించనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలంగాణలో కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సీబీఐ, ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. పలువురు ప్రముఖులను అరెస్ట్ లు చేసింది. వీరిలో వ్యాపారవేత్త దినేశ్ అరోరా ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన..రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కి సంబంధించి ఎల్ఎల్ సి డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ రావు,అరుణ్ రామచంద్రన్ పిళ్ళైలు ఉన్నారు. ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడైన దినేశ్‌ అరోరా బ్యాంక్ ఖాతాలోకి యూకో బ్యాంకు ద్వారా సమీర్‌ మహేంద్రు రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఈడీ విచారణలో తేలింది. ఆ నగదు ఆ తర్వాత సిసోడియాకు చేరిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ఆరోపించింది. కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ చేసిన అర్జున్‌ పాండే, విజయ్‌ నాయర్‌, రామచంద్ర పిళ్లై మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది.

అభిషేక్ బోయినపల్లికి ప్రస్తుతం 9 కంపెనీలతో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. అనూస్ ఒబేసిటీ అండ్ ఎలక్ట్రోలిసీస్, రాబిన్ డిస్టిలరీస్, అగస్టీ వెంచర్స్, ఎస్ఎస్ మైన్స్ అండ్ మినరల్స్, నియోవర్స్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యూ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, జీనస్ నెట్ వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనూస్ హెల్త్ అండ్ వెల్నేస్ వంటి కంపెనీలలో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.