హైదరాబాద్‌లో వరదలు వస్తాయా ?

  • Publish Date - May 28, 2020 / 01:37 AM IST

హైదరాబాద్ లో వరదలు పోటేత్తె ప్రమాదం ఉందని రాయల్ మెట్రాలాజికల్ సొసైటీ హైదరాబాద్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎర్త్ ఓసియన్ అండ్ అట్మాస్పియరిక్ సైన్సెస్ వెల్లడించింది. కేరళ, చెన్నైలకు ఈ తరహా హెచ్చరికలు చేసింది. హైదరాబాద్ నగరం, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో వరదల తీరుపై అధ్యయనం జరిపింది. ఇందులో హైదరాబాద్ లో ప్రకృతి పరమైన పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సమీప భవిష్యత్ లో ఉన్నట్టుండి కుండపోత వానలు, క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలు చోటు చేసుకొనే ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

హైదరాబాద్ లో 2016 సెప్టెంబర్ లో వచ్చిన వరదలు, చెన్నైలో 2015 డిసెంబర్, కేరళలో 2018 ఆగస్టు 15వ తేదీల్లో వచ్చిన వరదలకు దారి తీసిన పరిస్థితులపై సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అరేబియన్ సముద్రం గుండా..జూన్ లో కేరళను తాకడం, వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటాయని విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటాయి.

బంగాళాఖాతం మీదుగా రుతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తమిళనాడుకు చేరుకుంటాయి. కానీ..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న భూ తాపం, సముద్రం, భూమి ఉపరితలంలో వస్తున్న మార్పులు వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వానాకాలంలో కుండపోతగా వర్షాలు కురవడంపై వీరు అంచనా వేశారు. అత్యంతా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, తమిళనాడు నగరాలతో పాటు కేరళలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుందంటున్నారు. వర్షాకాలంలో ముంబై ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వర్షాకాలంలో మొత్తం కురవాల్సిన 80 సెంటిమీటర్ల వర్షం కేవలం 48 గంటల్లోనే కురవడం ఒక ఉదాహరణగా వెల్లడిస్తున్నారు. మరి ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందో వేచి చూడాలి. 

Read: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు : రాత్రి వేళ RTC సర్వీసులు..హైదరాబాద్ లో మాత్రం