Delhi Garbage Mountains : ఢిల్లీ చుట్టూ 28 మిలియన్ టన్నుల చెత్త .. తొలగించటానికి 197 ఏళ్లు పడుతుందట!

దేశ రాజధాని ఢిల్లీని ‘చెత్త’భయపెడుతోంది. నగరం చుట్టు పక్కల భారీగా పేరుకుపోతున్న చెత్త ఓ పెద్ద సమస్యలా తయారైంది. నగరంలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే మిలియన్ల టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను తొలగించాలంటే ఏకంగా 197 ఏళ్లు పడుతుందట..

Delhi garbage mountains : ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ పేరుకుపోతున్న ‘చెత్త’ ప్రపంచ దేశాలనే భయపెడుతోంది. ఈక్రమంలో దేశ రాజధాని ఢిల్లీని ‘చెత్త’భయపెడుతోంది. నగరం చుట్టు పక్కల భారీగా కాదు కాదు అత్యంత భారీగా పేరుకుపోతున్న చెత్త ఓ పెద్ద సమస్యలా తయారైంది. నగరంలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు విడుదలవుతున్నాయి అంటే ఈ చెత్త సమస్య ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. నగరం చుట్టుపక్కల పేరుకుపోయిన ఈ భారీ చెత్త సమస్య తొలగించాటానికి దశాబ్దాలు కాదు ఏకంగా దాదాపు రెండు శతాబ్దాలు పడుతుందట..!! అంటే ఆ భారీ చెత్త ఎంతగా ఉందో ఊహించుకోవటానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఢిల్లీ చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో 27.6 మిలియన్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయి పడి ఉన్నాయి. ఈ వ్యర్థాలను తరలించేందుకు రూ.250 కోట్ల ఖర్చు అంచనాతో మూడు సంవత్సరాల క్రితం ప్రాజెక్టు చేపట్టగా..ఈ మూడేళ్లలో 28 మిలియన్ టన్నుల నుంచి 27.6 మిలియన్ టన్నులకే వ్యర్థాలు తగ్గాయి.

అంటే కేవలం 0.4 మిలియన్ టన్నుల వ్యర్థాల తగ్గింపునకు మూడేళ్లు పడితే.. మొత్తం పోవడానికి ఎంతకాలం పడుతుందో ఊహించుకోవటానికి భయం కలిగేలా ఉందీ చెత్త సమస్య. గత మూడేళ్లలో రోజూ సగటున 5,315 టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయడం..తొలగించడం చేశారు. అదే సమయంలో ఢిల్లీలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు వచ్చి పడుతున్నాయి. దీంతో ఇప్పుడున్న ప్రకారం శుద్ధి జరిగితే ఢిల్లీలో పేరుకున్న మొత్తం వ్యర్థాలను తొలగించేందుకు ఎంత లేదన్నా 197 ఏళ్ల సమయం పడుతుందని అంచనా.

ఈ సమస్యపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లోని మునిసిపల్ సాలిడ్ వేస్ట్ సెక్టార్‌కు చెందిన వేస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణుడు..ప్రోగ్రామ్ డైరెక్టర్ అతిన్ బిస్వాస్ మాట్లాడుతూ.. తడి వ్యర్థాలను బయోమైన్ చేయడం కష్టమని..అందువల్ల టైమ్‌లైన్‌లను అంచనా వేయడానికి సంవత్సరంలో 8-9 నెలలు మాత్రమే పరిగణించాలని అన్నారు.







                                    

ట్రెండింగ్ వార్తలు