Schools Reopen : ఫిబ్రవరి 15 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ : సీఎం ప్రకటన

ఫిబ్రవరి 15, 2022 నుండి స్కూల్స్ తిరిగి తెరుస్తామని..సీఎం ప్రకటించారు.

Assam Schools Reopen

Assam schools reopen : ఫిబ్రవరి 15, 2022 నుండి స్కూల్స్ తిరిగి తెరుస్తామని..అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తగ్గుదలను బట్టి ఇప్పటికే విధించిన కర్ఫ్యూని సడలిస్తామని కూడా ప్రకటించారు. అస్సాంలో కోవిడ్ -19 కేసులు కొనసాగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 2,000కి చేరుకుంది. కేసుల్ని తగ్గించటానికి తగిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

కేసులు తగ్గుదలను బట్టి ప్రస్తుతం రాత్రి 10 గంటల నుండి కర్ఫ్యూ సమయాలు రాత్రి 11 గంటల వరకు సడలించబడతాయని సీఎం ప్రకటించారు. కాగా అస్సాంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో ఈ జనవరి 25 నుండి స్కూల్స్ లో 8th calsses వరకు శారీరక తరగతులు నిలిపివేశారు. ఈక్రమంలో మూతపడిన క్లాసులు తిరిగి ఫిబ్రవరి 15 నుండి తెరవబడతాయని సీఎం తెలిపారు.

అస్సాం రాష్ట్రం వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే టీనేజర్లకు కూడా టీకాలు వస్తున్నారు. అలా ఇప్పటి వరకు 15-18 ఏళ్లలోపు దాదాపు తొమ్మిది లక్షల మంది పిల్లలకు టీకాలు వేయించామమని సీఎం తెలిపారు. స్కూల్స్ తెరిస్తే పిల్లలకు టీకాలు వేయడం సులువవుతుందని సీఎం వివరించారు. ఫిబ్రవరి 28 నాటికి టీనేజర్లకు రెండు మోతాదుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నామని సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.