Rape Attempt: వృద్ధురాలిపై ఆత్యాచారయత్నం, హత్య.. ప్రశ్చాత్తాపంతో చివరికి..
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హతమార్చి కేసును తప్పుదోవ పట్టించేలా సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి పోలీసులు ఎలాగైనా ఈ కేసులో నిందితులను బయటకు లాగుతారని భావించి రెవెన్యూ అధికారుల ఎదుట లొంగిపోయాడు.
- Naresh Mannam
- Published On : June 9, 2021 / 03:22 PM IST
Attempted Rape And Murder Of An Old Woman Finally With Remorse
Rape Attempt: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హతమార్చి కేసును తప్పుదోవ పట్టించేలా సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి పోలీసులు ఎలాగైనా ఈ కేసులో నిందితులను బయటకు లాగుతారని భావించి రెవెన్యూ అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఈ అమానుష ఘటన జరిగింది. పట్టణంలోని బందావారివీధిలో కర్నాటి విజయలక్ష్మి (61) అనే వృద్ధురాలు భర్త మరణంతో కొన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తుంది.
అదే వీధిలో విజయలక్ష్మి నివాసానికి దగ్గర్లోనే తులాబంధు సాంబశివరావు, విజయలక్ష్మి అనే దంపతులు ఉంటున్నారు. కొంతకాలంగా సాంబశివరావు కుటుంబంతో వృద్ధురాలికి స్నేహబంధం కొనసాగుతుంది. ఈక్రమంలోనే గత నెల 11వ తేదీ రాత్రి సాంబశివరావు వృద్ధురాలి ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించినా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అలా కొద్దిసేపు గొడవ, వాగ్వాదం అనంతరం సాంబశివరావు మాయమాటలతో వృద్ధురాలిని నమ్మించి క్షమించమని కోరి మంచి నీళ్లు కావాలని అడిగాడు. మంచి నీళ్లు తెచ్చేందుకు వృద్ధురాలు వంట గదిలోకి వెళ్లిన సమయంలో సాంబశివరావు ఆమెపై దాడి చేశాడు.
దీంతో ఆ వృద్ధురాలు తీవ్ర గాయాలతో స్పృహ తప్పిపడిపోయింది. ఎప్పటికైనా వృద్ధురాలు తన బండారం బయటపెడుతుందని భావించిన సాంబశివరావు ఆమెను హమార్చాలని నిర్ణయించుకొని గొంతు నొక్కి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నాలుగు రోజుల అనంతరం హత్య విషయం బయటపడగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో విషయం ఎప్పటికైనా బయటపడుతుందని భావించిన సాంబశివరావు పశ్చాత్తాపంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. రెవెన్యూ అధికారులు నిందితున్ని పోలీసులకు అప్పగించారు.
