ఇదో రకం నిరసన : కుక్కలకు పుట్టినరోజు బ్యానర్లు

Aurangabad : locals protest against birthday banners : నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించటం సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లిళ్ల, పుట్టిన రోజులకే కాదు చిన్న చిన్న సందర్భాలకు కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేయటం పరిపాటిగా మారిపోయింది. ఈ బ్యానర్లు, ఫ్లెక్సీల గోల ఎక్కువైపోయింది. డివైటర్లకు, హోర్డింగ్ లకే కాకుండా చెట్లకు, పుట్లకు, గోడలకు ఇలా ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమవుతున్నాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టమొచ్చినట్లుగా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకూడదనే రూల్స్ ఉన్నా వీటిని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇవి ప్రమాదాలకు కూడా కారణమువుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు.

మహారాష్ట్రలోని బీద్ జిల్లా అంబేజోగాయ్ ప్రాంతంలో వీధుల్లోని భవనాలు, చెట్లపై రకరకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీ సంఖ్యలో ముంచెత్తడంపై చిర్రెత్తుకొచ్చిన అక్కడి ప్రజలు వెరైటీగా నిరసన తెలిపారు. ఈ బ్యానర్లకు, ఫ్లెక్సీలకు చెక్ పెట్టేందుకు ఓ వెరైటీ నిరసనల్ని వ్యక్తం చేశారు. కుక్కలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు కట్టారు. దీంతో ఈ విషయంకాస్తా పోలీసుల వద్దకెళ్లింది. దీంతో సదరు బ్యానర్ కట్టినవారిని పిలిచ్చి వివరణ అడిగారు. దానికి వారు చెప్పిన సమాధానం విని సరైందే అనుకున్నారు.

పుట్టిన రోజులు, పండుగలు, పబ్బాలకు ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు వెలుస్తుండడంతో.. దీనికి వ్యతిరేకంగా స్థానికులు ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారని అంబేజొగయ్ పోలీస్టేషన్ అధికారులు వెల్లడించారు.అలా కుక్కల పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ కట్టిన బ్యానర్లను వెంటనే స్థానికులు తొలగించారు. ఇక నుంచి ఎవ్వరి పడితే వాళ్లు..ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు కట్టకూడదని తెలిపారు. కాగా వీటిపై ఎలాంటి వివాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు