Aaron Finch ODI Retirement: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్..

ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 35ఏళ్ల ఫించ్ ఆదివారం కెయిర్న్స్‌లో న్యూజీల్యాండ్‌తో తన 146వ చివరి వన్డే మ్యాచ్ ఆడి వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారు.

Aaron Finch

Aaron Finch ODI Retirement: ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 35ఏళ్ల ఫించ్ ఆదివారం కెయిర్న్స్‌లో న్యూజీల్యాండ్‌తో తన 146వ చివరి వన్డే మ్యాచ్ ఆడి వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారు. 2013లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శ్రీలంకపై ఫించ్ అరంగేట్రం చేశాడు. స్కాట్‌లాండ్‌పై 148 పరుగులతో తన తొలి సెంచరీని సాధించాడు. ఫించ్ వన్డేల్లో 5,401 పరుగులు చేశాడు. 17 సెంచరీలు చేశాడు. వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

Aaron Finch: ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై ఆరోన్ ఫించ్ ఏమన్నారంటే?

వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ సందర్భంగా ఫింఛ్ మాట్లాడుతూ.. వన్డేల్లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అద్భుతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించానని అన్నారు. ఆ ప్రయాణంలో ఎంతో మంది ప్లేయర్లు అండగా నిలిచారని ఫించ్ అన్నారు. వచ్చే ప్రపంచ కప్ కోసం కొత్త నాయకున్ని తయారు చేయాలని, తనకు సహకరించిన వారికి ఫించ్ కృతజ్ఞతలు తెలిపారు.

Hong Kong Cricketer: మ్యాచ్ అనంతరం స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్ .. ఆమె ఎలా రియాక్టయిందంటే.. వీడియో వైరల్

ఫించ్ కెప్టెన్ గా రాణిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అటతీరు పేలవంగా ఉంది. గడిచిన ఏడు వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫించ్ .. వరుసగా 5, 5, 1, 15, 0, 0, 0 స్కోర్ లు మాత్రమే చేయగలిగారు. తన కెరియర్‌లోనే అత్యుత్తమ క్లిష్ట సమయాన్ని ఫించ్ ఎదుర్కొన్నాడు. ఫించ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అతను వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదిలాఉంటే 2018లో బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో స్టీవ్‌స్మిత్ నిషేధానికి గురైన తర్వాత అతను కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.