Bajaj Chetak: మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్!

బజాజ్ చేతక్ అంటే ఒకప్పుడు బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్. ఒక టైంలో మార్కెట్ ని ఏలిన బజాజ్ చేతక్ ఆ తర్వాత ప్రజలలో బైకులపై క్రేజ్ పెరగడంతో మళ్ళీ దూరమైంది. అయితే ఇప్పుడు భగ్గుమంటున్న పెట్రోల్ ధరలతో మన దేశంలో కూడా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే బజాజ్ మళ్ళీ తన పాత చేతక్ మోడల్ ను రీ మోడల్ చేసి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి మార్కెట్ లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

Bajaj Chetak: బజాజ్ చేతక్ అంటే ఒకప్పుడు బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్. ఒక టైంలో మార్కెట్ ని ఏలిన బజాజ్ చేతక్ ఆ తర్వాత ప్రజలలో బైకులపై క్రేజ్ పెరగడంతో మళ్ళీ దూరమైంది. అదే బజాజ్ కంపెనీ తెచ్చిన పల్సర్, అధిక మైలేజీ ఇచ్చే డిస్కవర్, ప్లాటినం, CT100 మోడల్స్ మీద సామాన్య ప్రజలు మొగ్గు చూపడంతో చేతక్ కూడా కనుమరుగైంది. అయితే ఇప్పుడు భగ్గుమంటున్న పెట్రోల్ ధరలతో మన దేశంలో కూడా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే బజాజ్ మళ్ళీ తన పాత చేతక్ మోడల్ ను రీ మోడల్ చేసి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి మార్కెట్ లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

Bajaj Chethak1

గతేడాదే బజాజ్ చేతక్​ పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అనంతరం కొన్ని రోజులు బుకింగ్స్‌కు అనుమతించి వినియోగదారుల నుండి బుకింగ్స్ నమోదు చేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఇండియాలో మొత్తం 18 డీలర్‌షిప్‌ సెంటర్ల ద్వారా ఈ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించగా అందులో ఐదు మహారాష్ట్రలోని పుణెలో ఉండగా… మిగిలినవి బెంగళూరులో ఉన్నాయి. కానీ ఆ తర్వాత కరోనా మహమ్మారి మన దేశంలో విరుచుకుపడడంతో గత్యంతరం లేని కారణంగా సెప్టెంబర్​ నెలలో ఎలక్రిక్ చేతక్ బుకింగ్స్ ​ఆపేసింది.

Bajaj Chethak2

అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఉన్నా మార్కెట్ ఊపందుకోవడం.. పెరిగిన ఇంధన ధరలతో ప్రజలలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తుండడంతో మళ్ళీ బుకింగ్స్ మొదలు పెట్టింది. బజాజ్ అంటేనే స్కూటర్లలో బ్రాండ్ గా పేరుంది. ఇప్పుడు ఆ పేరుతోనే అత్యధిక బుకింగ్స్ నమోదు చేసుకోవాలని చూస్తుంది. బజాజ్​ అధికారిక వెబ్‌సైట్‌ (https://www.bajajauto.com)లో రూ.2,000 రిజిస్ట్రేషన్ ​ఫీజుతో కంపెనీ ఈ వాహనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. యూరప్​ మార్కెట్‌లో కూడా చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మడానికి లైసెన్స్​ పొందిన బజాజ్ మన దేశంలో విస్తృతంగా అమ్మకాలు చేపట్టాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Bajaj Chethak3

అన్నట్లు ఈ స్కూటర్ ఎలా పనిచేస్తుంది ఛార్జ్ ఎలా వస్తుందనే డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఈ చేతక్ లోని ఎలక్ట్రిక్ మోటార్ 3.8 కిలోవాట్/4.1 కిలోవాట్ గరిష్ట శక్తిని విడుదల చేస్తూ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా‌ వెనుక చక్రాన్ని రొటేట్ చేస్తుంది. ఇందులో 3 కిలోవాట్ల లిథియం -అయాన్ బ్యాటరీ ఉండగా ఇది ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఎకోమోడ్​లో 95 కిలో మీటర్లు, స్పోర్ట్ మోడ్​లో 85 కిలో మీటర్లు ప్రయాణించగలదు. మాములుగానే చేతక్ అంటే మిడిల్ క్లాస్ కామన్ మెన్ స్కూటర్ గా పేరుండగా ఈ ఎలక్ట్రిక్ చేతక్ ను కూడా అదే రేంజ్ లో అందించాలని బజాజ్ ప్రయత్నిస్తుంది.

Bajaj Chethak4

ట్రెండింగ్ వార్తలు