Balakrishna: అన్‌స్టాపబుల్-2 కోసం బాలయ్య భారీగా డిమాండ్ చేస్తున్నారా..?

నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎవరి ఊహలకు అందకుండా అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ టాక్ షోను ప్రముఖ ఓటీటీ.....

Balakrishna Demanding Huge Remuneration For Unstoppable 2

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎవరి ఊహలకు అందకుండా అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ టాక్ షోను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేయగా, దీనికి నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కింది. ఈ టాక్ షో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలయ్యలోని కొత్త యాంగిల్‌ను చూశారు ప్రేక్షకులు. బాలయ్య ఇలా హోస్ట్‌గా కూడా చేయగలరా అని అందరూ అవాక్కయ్యారు.

Unstoppable With NBK: బాలయ్యతో మెగాస్టార్ ఎపిసోడ్.. ఎందుకు వర్క్‌ఔట్ కాలేదంటే?

అయితే అన్‌స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య చాలా మంది స్టార్స్‌ను ఇంటర్వ్యూ చేశాడు. వారితో కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. బాలయ్య తనదైన స్టయిల్‌లో ఈ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక ఈ షో సక్సెస్ కావడంతో ఆహాకు సబ్‌స్క్రైబర్స్ కూడా పెరిగారట. అయితే ఈ టాక్ షోను హోస్ట్ చేసినందుకు గాను బాలయ్య డీసెంట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి సెకండ్ సీజన్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గతంలో ఆహా నిర్వాహకులు, బాలయ్య కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 2కి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయ్యిందని.. త్వరలోనే ఈ టాక్ షోను తిరిగి ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టాక్ షో కోసం బాలయ్య తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

దీంతో నిర్వాహకులు బాలయ్య టాక్ షో విషయంపై ఆయనతో చర్చించి ఓ నిర్ణయానికి రావడానికి ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలోనే నిర్మాత అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగి బాలయ్యతో ఇదే విషయంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 2 మన ముందుకు రావడం ఖాయమని అంటున్నారు ఆహా నిర్వాహకులు.