Balakrishna speech in Dhamki trailer launch event
Balakrishna : విశ్వక్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ధమ్కీ. నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇటీవల విశ్వక్ అన్ స్టాపబుల్ షోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ షోలో విశ్వక్ తో కలిసి బాలయ్య రచ్చ రచ్చ చేశారు. ఆ షో సమయంలో ఇద్దరూ క్లోజ్ అవ్వడంతో పిలవగానే వచ్చారని విశ్వక్ చెప్పాడు.
Dhamki Trailer: ధమ్కీ ట్రైలర్.. క్లాస్ కోసం మాస్.. ఊరమాస్!
ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ”ట్రైలర్ చాలా బాగుంది. సినిమా సక్సెస్ అయినట్లే. విశ్వక్ కి సినిమా అంటే పిచ్చి. మంచి సినిమాలను, కొత్త సినిమాలని తెలుగు వాళ్ళు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు చూసి నన్ను కూడా అక్కడ హీరోలా ఊహించుకుంటాను. నాకు కూడా ఇలా ఇంకా కొత్త జోనర్స్ లో సినిమాలు చేయాలని ఉంది. సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రారు అని అనుకుంటున్నారు, కానీ మంచి సినిమాలు ఇస్తే వాళ్ళే వస్తున్నారు. నేను నర్తనశాల చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదు. వచ్చే సంవత్సరమే ఆదిత్య 369 సీక్వెల్ ఉంది. ఆదిత్య 999 మీ ముందుకి త్వరలోనే వస్తుంది” అని తెలిపారు.