Bandi Sanjay : భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు : బండి సంజయ్

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో బండి సంజయ్ బ్రాహ్మణ, అర్చక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay : ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో బండి సంజయ్ బ్రాహ్మణ, అర్చక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు. భగవద్గీత వినిపిస్తే..ప్రశాంతంగా అనిపించాలి. ఒకప్పుడు అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తే ఎవరైనా చనిపోయారా? అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని..పవిత్రమైన భగవద్గీతను స్వర్గపురి (అంతిమ యాత్ర వాహనాలకు) వాహనాలకు భగవద్గీత పెడితే దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు. రామాయణం,మహాభారతలాలను కూడా కామెడీ చేస్తున్నారని..ఇకపై ఇటువంటివి సహించేది లేదన్నారు.భగవద్గీతను శవయాత్రల్లో పెట్టకూడదని అలా చేస్తే భౌతిక దాడులు చేస్తాం అంటూ వ్యాఖ్యానించారు.   అలాగే మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు వ్యాఖ్యలు చేశారు. టికెట్ కోసం ఆశావహులు లాబీయింగ్ లు చేద్దామనుకుంటే కుదరవ్ అని..బీజేపీలో లాబియింగ్ లు ఉండవని అటువంటివి ఈ పార్టీలో చెల్లవని స్పష్టం చేశారు.

కాగా మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచిన బీజేపీ ఏకంగా అధిష్టానమే దిగి రానుంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం భారీ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఏకంగా అమిత్ షాయే రానున్నారు. అంటే బీజేపీ మునుగోడుపై ఎంత ఫోకస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 21న మునుగోడులో నిర్వహించబోయే సభకు భారీగా జనసమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. ఇక ఈ సభ తరువాత కూడా బీజేపీ అగ్ర నాయకులు మునుగోడులోనే మకాం వేయనున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ హాట్ గా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలో టికెట్ ఆశావహుల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. స్థానికంగా వ్యక్తమవుతున్న అసంతృప్త జ్వాలలను చల్లార్చే పనిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  జరగనున్న ఉప ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్,బీజేపీ ఈ మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను బీజేపీకి మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా మునుగోడు ఉప ఎన్నిక ఒక సవాల్ అని చెప్పి తీరాల్సిందే. ఇక అధికార టీఆర్‌ఎస్‌కూ ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారనుంది. హుజూరాబాద్ లో తిన్న దెబ్బ మరోసారి తినకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అభ్యర్థి ఎన్నికలో వస్తున్న అసంతృప్తులను చల్లార్చి అభ్యర్థిని ఎంపిక చేసి గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉంది.

ట్రెండింగ్ వార్తలు