Ban VS Aus: సిరీస్ బంగ్లా కైవసం.. ఆస్ట్రేలియాపై సంచలన విజయం!
బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. వరసగా మూడు మ్యాచ్ లలో ఘనవిజయం సొంతం చేసుకొని మరో రెండు మ్యాచ్ లు ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.
- Naresh Mannam
- Updated on- August 6, 2021 / 10:50 PM IST
Ban Vs Aus
Ban VS Aus: బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. వరసగా మూడు మ్యాచ్ లలో ఘనవిజయం సొంతం చేసుకొని మరో రెండు మ్యాచ్ లు ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ద్వైపాక్షిక సిరీస్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడం బంగ్లాదేశ్ కు ఇదే మొదటిసారి.
ఈ సిరీస్ లో బంగ్లా జట్టు తొలి నుండే ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేయగా.. తర్వాత ఆసీస్ 20 ఓవర్లలో 108 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఇక, ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసుకుంది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్‌ను రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సత్తా చాటింది. రెండో టీ20లో ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఇక నేడు జరిగిన మూడవ మ్యాచ్ లో మొదట బంగ్లా 127/9 రన్స్ చేయగా.. ఆసీస్ 20 ఓవర్లలో 117/4 మాత్రమే చేయగలిగింది. దీంతో బంగ్లా సిరీస్ టైటిల్ సొంతం చేసుకుంది.
