BCCI Announces Schedules For Australia And South Africa home series
SA vs AUS : టీమిండియాతో స్వదేశంలో విదేశీ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో భారత్ సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు జట్లతో ఆడే హోం సిరీస్‌కు సంబంధించి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా ముందుగా ఆస్ట్రేలియా జట్టుతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత రెండో టీ20 నాగ్‌పూర్‌లో, మూడో టీ20 హైదరాబాద్‌లో జరగనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
BCCI Announces Schedules For Australia And South Africa home series
సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. సఫారీలతో మూడు టీ20లు ఆడనుంది. తిరువనంతపురం, గువాహతి, ఇండోర్ వేదికలుగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. మూడు వన్డేలు వరుసగా లక్నో, రాంచీ, ఢిల్లీలో జరుగుతాయి. సౌతాఫ్రికాతో భారత్ ఆడే రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 2న జరుగనుంది. గువాహతిలోనే ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
Check out the #INDvSA home series schedule. ?#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022
Take a look at #TeamIndia‘s home series fixture against Australia. ?#INDvAUS pic.twitter.com/zwNuDtF32R
— BCCI (@BCCI) August 3, 2022
Read Also : BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు