Diabetes : మధుమేహాన్ని అదుపులో ఉంచే తమలపాకు, నల్లజీలకర్ర కషాయం!

తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ పై పోరాడుతుంది. అలాగే నల్ల జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. నల్ల జీలకర్ర మధుమేహాన్ని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది.

Diabetes : మధుమేహం సమస్య ఎంతో మందిని బాధిస్తుంది. మధుమేహాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. క్లోమగ్రంధీలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం మధుమేహంలో మొదటి రకమైతే, రెండవ రకంలో రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉండటం. మధుమేహాన్ని తగ్గించుకోవడం, రాకుండా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మధుమేహం వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మధుమేహం అదుపులో ఉంచేందుకు తమలపాకు, నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక కప్పు నీటిలో ఒక తమలపాకు ముక్కలుగా కట్ చేసుకుని దానిలో అర స్పూన్ నల్ల జీలకర వేసి దానిని రాత్రిమొత్తం అలాగే ఉంచాలి. మరునాడు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇలా ప్రతిరోజు తీసుకున్నట్లయితే మధుమేహం కంట్రోల్లో ఉండడమే కాకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. మధుమేహం కారణంగా వచ్చే కొన్ని వ్యాధులకి ఈ కషాయం బాగా సహాయపడుతుంది. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ పై పోరాడుతుంది. అలాగే నల్ల జీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. నల్ల జీలకర్ర మధుమేహాన్ని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది.

మధుమేహంతో బాధపడుతున్నవారు మెదడు, కిడ్నీ, కళ్ళు, గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే దాని ప్రభావం ఆయా అవసయవాలపై ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. భోజన వేళలను క్రమం తప్పకుండా పాటించాలి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు