Hyderabad: హైదరాబాద్ మహానగరం మరో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌కు రెడీ అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ కార్ల మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ (ఫార్ములా ఈ-రేసింగ్) జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను హెచ్ఎండీఏ (హైదాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వేగంగా పూర్తి చేస్తోంది.
Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?
ఇందులో భాగంగా నెక్లెస్‌రోడ్డులో 2.7 కిలోమీటర్ల మేర రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మీదుగా 17 టర్నింగ్‌లు వచ్చేలా ట్రాక్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన సివిల్ వర్క్స్ కిలోమీటర్‌కు రూ.2.27 కోట్ల అదనంగా ఖర్చవుతోంది. ఫార్ములా ఈ-రేసింగ్‌లో కార్లు 280 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకుపోతాయి. ఈ రేసింగ్‌ను కనీసం 35 వేల మంది వీక్షించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 10 నాటికి గ్యాలరీలు పూర్తయ్యే అవకాశం ఉంది. నవంబర్ 19, 20 తేదీల్లో ట్రయల్ రన్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ అధికారులు అలర్ట్ అయ్యారు. నెక్లెస్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.