విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్
- Naveen
- Published On : March 3, 2021 / 02:13 PM IST
big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరనున్నారు.
కాశీ విశ్వనాథ్ కి విశాఖలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉంది. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలుపులో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాంటి నేత వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరనుండటంతో.. నెక్ట్స్ గంటానే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
