బిగ్ బాస్ నాల్గవ సీజన్: కంటెస్టెంట్లు వీళ్లేనా?

  • Publish Date - May 13, 2020 / 09:41 AM IST

బాలీవుడ్ బుల్లితెరపై బ్లాక్ బస్టర్ అయ్యి.. అన్నీ ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన షో బిగ్ బాస్.. దక్షిణాదిలో తెలుగులో కూడా ఈ షో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక నాల్గవ సీజన్ కూడా త్వరలో సిద్ధం అవబోతుంది.

ఈ సీజన్ గురించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. మొదటి మూడు సీజన్లకు ముగ్గురు స్టార్ హీరోలు హోస్ట్‌లుగా చెయ్యగా.. నాల్గవ సీజన్‌కు మూడవ సీజన్‌లో హోస్ట్‌గా ఉన్న నాగార్జునే మరోసారి హోస్ట్‌గా చెయ్యబోతున్నాడు.  

ఇక ఇంతకుముందు మాదిరిగానే ఈ సారి కూడా ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో సెలబ్రిటీని ఎంపిక చేస్తుందట బిగ్ బాస్ యూనిట్.. ఈ రియాలిటీ షోలో పోటీదారులుగా ఉండవలసిన సభ్యుల కోసం నిర్వాహకులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారట. 

అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ నిర్వాహకులు ‘అల్లరి’ నరేశ్.. ‘సుడిగాలి’  సుధీర్.. హీరో నందూ.. కమెడియన్ తాగుబోతు రమేశ్.. యాంకర్ ఝాన్సీ, యాంకర్ వర్షిణి తదితరుల పేర్లను పరిశీలిస్తుందట. కొంతమందితో సంప్రదింపులు పూర్తి కాగా, మరి కొందరితో చర్చలు జరుపుతున్నారు. 

Read Here>> రేపే నిఖిల్ పెళ్లి.. నిబంధనలు ప్రకారమే!