BiggBoss 6 Day 81 contestants family members entry into house
BiggBoss 6 Day 81 : గత రెండు ఎపిసోడ్స్ నుంచి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని హౌజ్ లోకి తీసుకొస్తున్నాడు బిగ్‌బాస్. గురువారం ఎపిసోడ్ లో కూడా ఇంటి సభ్యులతో కళకళలాడింది బిగ్‌బాస్ హౌజ్. మొదట శ్రీహాన్ ప్రేయసి సిరి హౌస్ లోకి వచ్చింది. శ్రీహన్ ఎమోషనల్ అయి సిరిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. సిరి తన మెడపై వేసుకున్న శ్రీహాన్ నేమ్ టాటూని చూపించడంతో శ్రీహాన్ ఏడ్చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ దత్తత తీసుకున్న బాబు కూడా హౌస్ లోకి రావడంతో శ్రీహాన్ మరింత సర్ప్రైజ్ అయ్యాడు. బాబు తన అల్లరితో హౌజ్ లో హడావిడి చేశాడు. సిరి, శ్రీహాన్ ఇద్దరూ కలిసి లవ్ మెలోడీ సాంగ్స్ కి స్టెప్పులేశారు.
కీర్తికి ఎవరూ లేకపోవడంతో తన కోసం ఎవరు రారని, వచ్చే వాళ్ళందరిని చూస్తూ బాధపడింది. అయితే కీర్తి కోసం తన ఫ్రెండ్, సీరియల్ నటుడు మహేష్ రావడంతో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. కీర్తి మహేష్ ని హగ్ చేసుకొని ఏడ్చేసింది. మహేష్ కీర్తికి మోటివేషన్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు మహేష్ ఇనయాని కిస్ అడగడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇనయా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.
ఆ తర్వాత ఇనయా కోసం ఆమె తల్లి వచ్చింది. దీంతో ఇనయా చాలా ఆశ్చర్యపోయి ఎమోషనల్ అయింది. ఇనయా తండ్రి చనిపోవడం, ఇంటిని వదిలేసి ఇనయా సినీ పరిశ్రమకి రావడం, తల్లికి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ దూరంగా ఉన్నారు. తన తల్లి కూడా తనతో మాట్లాడటం మానేసిందని గతంలోనే బిగ్‌బాస్ హౌజ్ లో చెప్పింది. ఇప్పుడు ఇనయా తల్లి హౌజ్ లోకి రావడంతో ఇనయా ఏడ్చేసింది.
BiggBoss 6 Day 80 : కంటెస్టెంట్స్ ఫ్యామిలీలతో సందడిగా బిగ్‌బాస్..
ఇనయా తల్లి ఆమెని హగ్ చేసుకొని.. ”నాకోసం ఇంత బాధపడుతున్నావని తెలీదు. నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక్కడిదాకా వచ్చావు. బిగ్‌బాస్ గెలిచి బయటకి రా” అని మోటివేట్ చేసింది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అని తల్లితో అడగగా ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అని చెప్పింది. ఆమె హౌజ్ నుంచి వెళ్ళేటప్పుడు ఇనయా తన తల్లి పాదాలకి నమస్కరించి ఏడ్చేసింది. దీంతో ఈ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గానే సాగింది. హౌజ్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వెళ్లారు.