Huzurabad by election : కారును వెనక్కి నెట్టేసి..10వ రౌండ్ లోనూ బీజేపీ ముందంజ

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు.

Huzurabad by election 2021 : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో  కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు. ఎనిమిదో రౌండ్ లో కాస్త వెనుకబడ్డ ఈటల తొమ్మిదో రౌండ్ లో పుంజుకున్నారు. అలా 10వ రౌండ్ లో కూడా మరోసారి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 10వ రౌండ్ లో ఈటల 526 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Read more : Huzurabad Results: హుజూరాబాద్ లైవ్ అప్‌డేట్స్: 9వ రౌండ్ పూర్తి : ఆధిక్యంలోకి బీజేపీ.. ఈటలకు 5,305 ఓట్లు

బీజేపీ ఇప్పటి వరకు 5,631 ఓట్ల ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఇదే దూకుడు కొనసాగితే.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మొత్తం 11 రౌండ్లు ఓట్ల లెక్కింపు ఉండగా 10వ రౌండ్ లో కూడా బీజేపీ నేత ఈటల ఆధిక్యంలో ఉండటం విశేషం. మరి మరో రౌండ్ లో గెలుపు ఓటములను నిర్ణయించనుంది. ఈ క్రమంలో మరి గెలుపుకు మరో అడుగు దూరంలో ఉన్నారు అభ్యర్ధులు. మొత్తం 22 రౌండ్స్ లో లెక్కింపు పూర్తికానున్న క్రమంలో గెలుపు ఎవరిదో తేలనుంది.

కాగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మద్యే ప్రధాని పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఉంది.హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు గట్టి క్యాడర్ ఉన్నా ఏమాత్రం పనిచేయాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని ఈ ఉప ఎన్నికల్లో పెద్దగా ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది.  ఈటల టీఆర్ఎస్ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన నాటినుంచి టీఆర్ఎస్ పార్టీమీద విమర్శలు సంధిస్తునే ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నేతలు కూడా ఈటలపై మూకుమ్మడి మాటల యుద్ధంతో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఎన్నిక గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. హుజూరాబాద్ లో నేను ఓడిపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఈటల ప్రకటించారు. ఈక్రమంలో ఈటల హుజూరాబాద్ లో పట్టు నిలుపుకోవటానికి..టీఆర్ఎస్ ప్రతిష్ట నిలుపుకోవటానికి హోరా హోరీగా ప్రచారాలు చేశారు. ఈక్రమంలో 10 రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటలే ముందంజలో ఉండటం గమనించాల్సిన విషయం.

 

ట్రెండింగ్ వార్తలు