Shrikant Tyagi arrested: మహిళను తిట్టిపోసిన బీజేపీ లీడర్ అరెస్ట్

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు. త్యాగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయట. 2007 నుంచి ఆయనపై అదే మహిళ తొమ్మిది కేసులు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి

Shrikant Tyagi arrested: నోయిడా హౌసింగ్ సొసైటీలో ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడటమే కాకుండా, ఆమెపై దాడి చేసిన బీజేపీ కిసాన్ మర్చాకు చెందిన శ్రీకాంగ్ త్యాగీని అరెస్ట్ చేసినట్లు నోయిడా పోలీసులు మంగళవారం తెలిపారు. ఇదే కేసులో సోమవారం త్యాగి నివాసంలోని అక్రమ కట్టడాల్ని బుల్డోజర్లతో కూల్చివేసింది నోయిడా అడ్మినిస్ట్రేషన్. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సె సొసైటీలోని సెక్టార్-93బీకి పోలీసులతో పాటు అధికారులు చేరుకుని ఈ తతంగాన్ని పూర్తి చేశారు. కాగా, త్యాగి తనను తాను బీజేపీ కిసాన్ మర్చాకు చెందిన వాడినని చెప్పుకున్నప్పటికీ, అతడు తమ పార్టీ కార్యకర్త కాదని బీజేపీ ప్రకటించడం గమనార్హం.

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు. త్యాగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయట. 2007 నుంచి ఆయనపై అదే మహిళ తొమ్మిది కేసులు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. బెదిరింపులు, నేరపూరిత చర్యలు, అల్లర్లు, హింస వంటి చర్యల కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. 2020లో త్యాగిపై హత్యాయత్నం, క్రమినల్ కేసులు నమోదైంది. తాజా కేసులో రెండు ఎఫ్ఐఆర్‭లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు

ట్రెండింగ్ వార్తలు