Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు

సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్టం అవుతుంది. సున్నితమైన కేసులను ప్రత్యేకంగా కొంత మంది జడ్జిలకు కేటాయిస్తున్నారు. ఏ కేసు ఎవరికి వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి నిర్ధారిస్తారు. కానీ కొన్ని కోర్టులు స్వతంత్రంగా ఉండడం లేదు

Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు

Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని సీనియర్ న్యాయవాది కబిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం పాటు న్యాయవ్యవస్థలో పని చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంపై న్యాయవ్యవస్థలో ఉన్న వారి నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవ్యవస్థలో దశాబ్దాల సీనియారిటీ ఉన్న ఒక వ్యక్తి ఆ న్యాయవ్యవస్థనే తప్పు పట్టడం ఎంత మాత్రం సరికాదని, ఆయన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 6న న్యూఢిల్లీలోని పీపుల్స్ ట్రిబ్యూనల్‭లో క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియర్ అకౌంటబులిటీ అండ్ రిఫార్మ్స్, పీపుల్స్ యూనియర్ ఫర్ సివిల్ లిబర్టీస్, నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చసిన ‘‘జ్యుడీషియల్ రోల్‭బ్యాక్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి సిబల్ వెళ్లారు.

ఈ సందర్భంగా సిబల్ మాట్లాడుతూ ‘‘సుప్రీంకోర్టులో నీకు న్యాయం లభిస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు పడ్డట్టే. సుప్రీంకోర్టులో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న న్యాయవాదిగా నేను ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ ఏదైనా ఒక చారిత్రాత్మక తీర్పు వెలువడినా అది తన వాస్తవికతను చేరడం చాలా కష్టం అవుతుంది. కొన్ని కోర్టులు స్వతంత్రంగా ఉండడం లేదు. కాంప్రమైజ్ కావడం వల్ల కొన్ని కేసులు కొంత మంది జడ్జీలకు కేటాయించబడుతున్నాయి. సున్నితమైన కేసులను కొంత మంది జడ్జిలకే కేటాయిస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం ఏలా ఉంటుంది?’’ అని అన్నారు.

అయితే న్యాయవ్యవస్థ నమ్మకం లేదంటూ అంత పెద్ద సీనియర్ లాయర్ అనడమేంటని, అలాంటి వ్యక్తి అదే వ్యవస్థలో 50 ఏళ్లు ఏ నమ్మకంతో పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘సిబల్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఏ కేసైనా కోర్టుల్లో వాస్తవాల ఆధారంగానే విచారణ జరుగుతుంది. భారత రాజ్యాంగానికి విధేయతతో కోర్టులు పని చేస్తాయి. ఆయన చాలా సీనియర్, చాలా అనుభవమున్న వ్యక్తి. ఆయన ఇలా వ్యాఖ్యానించడం దారుణం’’ అని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ చైర్మన్ ఆదిష్ అగర్వాలా అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంకే మిశ్రా స్పందిస్తూ ‘‘మేమెంతగానో గౌరవించే అలాంటి వ్యక్తి నుంచి ఈ మాటలు వస్తాయనుకోలేదు. సుదీర్ఘకాలంగా ఆయన ఈ వృత్తిలో ఉన్నారు. కోర్టులు కూడా ఆయనకు చాలా గౌరవాన్ని ఇస్తాయి. కొన్ని కేసుల్లో ఆయన విశ్వాసం కోల్పోయారని న్యాయవ్యవస్థను అనుమానించడం సరికాదు’’ అని అన్నారు.

BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!