Malegaon blast caseలో BJP MP Pragya.. ఫోరెనిక్స్ నిపుణుల వెల్లడి

ఈ కేసులో ఎంపీ ప్రగ్యాసింగ్‭తో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిల ప్రమేయం ఉన్నట్లు 2008లో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. కాగా, ఈ కేసులో 2019 జూన్‭లో నలుగురు నిందితులకు నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

BJP MP Prahya: మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్(BJP MP Pragyasingh Thakur)కు సంబంధాలు ఉన్నట్లు తాజాగా ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. చాలా కాలంగా ఈ పేలుళ్లలో ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. తాజాగా ఫొరెనిక్స్ ఇచ్చిన రిపోర్ట్‭తో మరింత చిక్కుల్లో ఇరుక్కున్నారు. మాలేగావ్‭లోని మసీదులో జరిగిన పేలుడు స్థలంలో పేలుడు పదార్థాలు ఉంచిన ఒక ఎల్ఎంఎల్ వెస్పా స్కూటరు (bike link) పోలీసులకు లభించింది. ఈ ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ ప్రగ్యాసింగ్ ఠాకూర్ పేరుపై రిజిస్టర్ చేసి ఉందని ఫోరెన్సిక్ నిపుణులు ముంబయిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు (special NIA court in Mumbai) నివేదించారు. ఈ పేలుళ్ల కేసులో 261 మంది సాక్షులను ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు విచారించింది.

ఈ కేసులో ఎంపీ ప్రగ్యాసింగ్‭తో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిల ప్రమేయం ఉన్నట్లు 2008లో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. కాగా, ఈ కేసులో 2019 జూన్‭లో నలుగురు నిందితులకు నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2006లో 2008లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 2006లో జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది ముస్లిం యువకులు మరణించగా, 2008లో జరిగిన పేలుళ్లలో 37 మంది మరణించగా, 101 మంది గాయపడ్డారు. శుక్రవారం రోజున మసీదులో ప్రార్థనలు ముగియగానే వరసగా మూడు సార్లు బాంబులు పేలాయి.

Maharashtra: గెలవాలంటే పార్టీ గుర్తు అవసరం లేదు: సీఎం

ట్రెండింగ్ వార్తలు