Maharashtra: గెలవాలంటే పార్టీ గుర్తు అవసరం లేదు: సీఎం

ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్‭లో శివసేన నుంచి భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను బయటికి తీసుకువచ్చి మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని షిండే కూల్చారు. అనంతరం జూన్ 30న బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Maharashtra: గెలవాలంటే పార్టీ గుర్తు అవసరం లేదు: సీఎం

Maharashtra: మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలిపోయాక పార్టీ గుర్తు ఉద్ధవ్ వర్గానికి వస్తుందా, ముఖ్యమంత్రి షిండే వర్గానికి వస్తుందా అనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. శివసేన గుర్తు లేకుండా ఎలా గెలుస్తారని షిండే వర్గానికి ఉద్ధవ్ వర్గం నుంచి సవాళ్లు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు షిండే మంగళవారం సమాధానం ఇచ్చారు. పూణెలో మంగళవారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి పార్టీ గుర్తు అవసరం లేదని స్పష్టం చేశారు. అంటే శివసేన గర్తు లేకపోయినా తాను గెలుస్తానని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు సూటిగానే సమాధానం చెప్పారు. ఇక తమను మోసం చేశారంటూ శివసేన నేతలు చేస్తున్న ఆరోపణలను, విమర్శలను షిండే తిప్పి కొట్టారు. ఎవరు ఎవరిని మోసం చేశారో ఆలోచించుకోవాలంటూ షిండే ప్రశ్నించారు.

‘‘ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడింది. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మేమంతా పనికి దూరమయ్యాం. మాకే కాదు ప్రజలకు కూడా ముఖ్యమంత్రి దూరమయ్యారు. ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడానికి బదులు నా దగ్గరికి వచ్చేవారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు చెప్పాలి. ఇప్పుడు వారు మమ్మల్ని ద్రోహులు అని నిందిస్తున్నారు. ఎవరు ఎవరికి ద్రోహం చేశారో ఆలోచించుకోవాలి. మేము ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇంతకు ముందు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజల తీర్పుకు వ్యతిరేకం. నేను నా నియోజకవర్గంలో చాలా పనులు చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేస్తాను’’ అని సీఎం షిండే అన్నారు.

ఇక శివసేన ఎవరిదనే అంశంపై ఇరు వర్గాల నుంచి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్‭లో శివసేన నుంచి భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను బయటికి తీసుకువచ్చి మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని షిండే కూల్చారు. అనంతరం జూన్ 30న బీజేపీతో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

vice-presidential election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థికి మాయావ‌తి మ‌ద్ద‌తు