vice-presidential election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థికి మాయావ‌తి మ‌ద్ద‌తు

''కేంద్ర ప్ర‌భుత్వానికి, విప‌క్షాల‌కు మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో ఇటీవ‌లే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌రిగింద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఆగ‌స్టు 6న ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను, మా సిద్ధాంతాల‌ను దృష్టిలో పెట్టుకుని మేము ఈ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఈ విష‌యాన్ని నేను అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నాను'' అని మాయావ‌తి ట్వీట్ చేశారు.

vice-presidential election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థికి మాయావ‌తి మ‌ద్ద‌తు

vice-presidential election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్య‌ర్థిగా నిలిచిన జగదీప్ ధన్‌క‌ర్ (71)కు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మాజీ సీఎం మాయావ‌తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ”కేంద్ర ప్ర‌భుత్వానికి, విప‌క్షాల‌కు మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో ఇటీవ‌లే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌రిగింద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఆగ‌స్టు 6న ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను, మా సిద్ధాంతాల‌ను దృష్టిలో పెట్టుకుని మేము ఈ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఈ విష‌యాన్ని నేను అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నాను” అని మాయావ‌తి ట్వీట్ చేశారు.

కాగా, ఈ నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియ‌నుంది. దీంతో కొత్త‌ ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ స‌భ్యులు ఎన్నుకోనున్నారు. ఉప రాష్ట్రప‌తినూ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీకి దిగుతున్నారు. అయితే, పలు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

Raghuram Rajan: ‘ప‌లు దేశాల క‌న్నా అధికంగా ఉన్న‌ప్ప‌టికీ భార‌త్‌కు ఈ వృద్ధి రేటు స‌రిపోదు’