BJP spent Rs 340 cr on poll campaign 5 states say ec report
BJP spent Rs 340 cr on poll campaign 5 states say ec report : 2022లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ లో బీజేపీకి..కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి ఆప్ అధికారాన్ని చేజిక్కించుకుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సాధించింది. ఐదు రాష్ట్రాల్లోను విజయం కోసం బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. భారీగా ఖర్చు చేసింది. ఎంతగా అంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఏకంగా రూ.340 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం స్వయంగా తన రిపోర్టులో వెల్లడించింది.
ఆ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారం కోసం సుమారు 194 కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఎన్నికల ఖర్చు రిపోర్ట్‌లను ఎన్నికల కమీషన్ రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తమ పార్టీ ప్రచారం కోసం 340 కోట్లు ఖర్చు చేసిందని రిపోర్టులో పేర్కొంది. యూపీలో 221, మణిపూర్‌లో 23, ఉత్తరాఖండ్‌లో 43, పంజాబ్‌లో 36, గోవాలో 19 కోట్లు ఖర్చు చేసింది బీజేపీ. ఈ 5 రాష్ట్రాల్లోనే 194 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస పార్టీ ఈసీకి ఇచ్చిన తన నివేదికలో తెలిపింది. కాగా..లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు తమ ఎన్నికల వ్యయ నివేదికలను నిర్ణీత కాలవ్యవధిలో EC ముందు సమర్పించాల్సి ఉంటుంది.