Mamata banerjee on opposition unity
Lok Sabha elections 2024: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అప్పట్లో బీజేపీ బిహార్, జార్ఖండ్ తో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అన్నారు. ఇప్పుడు లేదని, మరికొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోనుందని చెప్పారు.
నదియా జిల్లాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయనివ్వబోమని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఏఏ, ఎన్ఆర్సీ వంటి వాటిని బీజేపీ వాడుకుంటోందని అన్నారు.
ఎక్కడ ఎన్నికలు వచ్చినా సీఏఏ, ఎన్ఆర్సీ గురించి బీజేపీ మాట్లాడుతూ వాటిని అమలు చేస్తామని హామీలు ఇస్తుందని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరు దేశ పౌరులో, ఎవరు కాదో బీజేపీ నిర్ణయిస్తుందా? అని ఆమె నిలదీశారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండును తెరమీదకు తీసుకువస్తూ విభజనను ప్రోత్సహిస్తోందని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి తాను ఎన్నడూ అంగీకరించబోనని చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..