Black Friday Sale early deal Buy Samsung Galaxy S22 Ultra at 375 Dollars
Black Friday Sale Deal : నవంబర్ 25న బ్లాక్‌డే సేల్ మొదలు కానుంది. అంతకన్నా ముందే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra)పై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజీతో స్మార్ట్‌ఫోన్ ధర 1,199.99 డాలర్లతో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు Samsung వెబ్‌సైట్‌లో ప్రస్తుత డిస్కౌంట్లు, ఆఫర్‌లతో ఫ్లాగ్‌షిప్ Android ఫోన్‌ను 374.99 డాలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రాపై బ్లాక్ ఫ్రైడే సేల్‌కు ముందు 600 డాలర్ల వరకు ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ని అందిస్తోంది.
మీరు Samsung ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేసి ఉంటే అదనంగా 225 డాలర్ల ట్రేడ్-ఇన్ క్రెడిట్ ఉంటుంది. Galaxy S22, S22+తో ట్రేడ్-ఇన్ క్రెడిట్ ఒక్కొక్కటి 500 డాలర్ల వరకు అందిస్తోంది. ముందస్తు యాక్సెస్ కస్టమర్ల కోసం.. Samsung Galaxy S22, Galaxy S22+ కొనుగోలుదారులకు 75 డాలర్లు, 150 డాలర్ల అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ని అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా కొనుగోలుపై ఫ్రీబీలను కూడా ఇస్తోంది. వీటిలో YouTube Premium సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 4 నెలల ఉచిత SiriusXM స్ట్రీమింగ్ కూడా ఉంది. కొనుగోలుదారులు 6 నెలల 100GB OneDrive క్లౌడ్ స్టోరేజీని కూడా పొందవచ్చు.
Black Friday Sale early deal Buy Samsung Galaxy S22 Ultra
Samsung Galaxy S22 అల్ట్రా స్పెసిఫికేషన్స్ :
Samsung Galaxy S22 Ultra అనేది S-పెన్‌తో వచ్చే S22 సిరీస్‌లోని హై-ఎండ్ ఫోన్. 4nm Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వచ్చింది. 1,750 నిట్స్ బ్రైట్‌నెస్ గరిష్ట ప్రకాశాన్ని పొందవచ్చు. Galaxy S22 Ultra విజన్ బూస్టర్ టెక్నాలజీతో వచ్చింది. స్క్రీన్‌ను అనుమతిస్తుంది. కెమెరా విధుల కోసం.. Samsung Galaxy S22 అల్ట్రా 108MP ప్రధాన లెన్స్‌తో పాటు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో సెన్సార్ మరొక 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.
సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 40MP కెమెరా ఉంది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫోన్ బాక్స్‌లో 45W ఛార్జర్‌తో వస్తుంది. Android 12 ఆధారంగా Samsung One UI 4.0పై రన్ అవుతుంది. ఇటీవల Android 12-ఆధారిత One UI 5.0 అప్‌డేట్స్ అందుకుంది. Samsung Galaxy S22 Ultras ఫాంటమ్ బ్లాక్ (512GB వేరియంట్)లో వస్తుంది. 256GB మోడల్ బుర్గుండి, ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్‌లలో అందుబాటులో ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Lava Blaze 5G : భారత్‌లో లావా బ్లేజ్ 5G ఫోన్ ఫస్ట్ టైం సేల్ మొదలైందోచ్.. వెంటనే కొనేసుకోండి..!