4pm Headlines
ఏం చేశారు..?
కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు..కానీ..బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుంది..?అంటూ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
స్కీమ్ వర్సెస్ స్కామ్..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చి రైతులు బాధపడుతున్నారు అంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ విమర్శించారు. BRS అంటే స్కీముల పార్టీ.. కాంగ్రెస్ అంటే స్కామ్‌ల పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.కర్ణాటకలో కరెంట్ కోతలతో రైలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ విమర్శించారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. చేవెళ్లలో గులాబీ జెండా ఎగరాలన్నారు. 111 జీవోను ఎత్తేస్తామన్న హామీని నెరవేర్చామని తెలిపారు.
మాటల దాడి..
BRS పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవరలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదల ప్రభుత్వం రావాలంటే.. దొరల రాజ్యం కూలాలి అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
ఢీ అంటే ఢీ..
పేదల భూములు లాక్కోవడం తప్ప చేసిందేమీ లేదు అంటూ బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు.ప్రజలు BRSను ఓడించాలన్న కసితో ఉన్నారని అన్నారు.
సమరశంఖం..
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంపై BRS ఫుల్ ఫోకస్ పెట్టింది. దీని కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈనెల 25న భారీసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
యువరానర్ ..
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణలు జరిగాయి. ఈ వాదనల్లో భాగంగా.. AAG పొన్నవోలు చంద్రబాబుకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్‌లు అంటూ తన వాదనల్ని వినిపించారు.
రిపోర్ట్ రగడ..
బాబు మరికొంతకాలం బెయిల్‌పై బయట ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. డాక్టర్లను మేనేజ్ చేసి హెల్త్ రిపోర్టును రాయించుకున్నారు అంటూ ఆరోపించారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టులను ఆశ్రయించవచ్చు..దానికి కోర్టు పరిగణలోకి తీసుకుంటే బెయిల్ ఇవ్వవచ్చు..కానీ ఇలా మేనేజ్ చేసి హెల్త్ రిపోర్టులు రాయించుకుని బయట ఉండేలా యత్నాలు చేయటం సరికాదన్నారు.
సీబీఐ ఎంక్వైరీ..
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ స్కామ్‌పై సీరియస్..ఢిల్లీ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు భూసేకరణ విషయంలో రూ. 850 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం (నంబర్ 16,2023) సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.
కమలం సంకల్పం
రాజస్థాన్‌లో సంకల్ప పత్ర పేరుతో BJP మ్యానిఫెస్టో ప్రకటించింది.రైతులు, మహిళలు, విద్యార్థులకు కమలం వరాలు కురిపించింది. కాంగ్రెస్ స్కామ్‌లపై దర్యాప్తు జరిపిస్తామని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా అన్నారు.
రాహుల్ ఫైర్ ..
బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తుంది అంటూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
ఉగ్రవాదుల ఏరివేత..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.భద్రతాదళాలు ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
అగ్నికి ఆహుతి..
చైనాలోని బొగ్గు కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లూలియాంగ్ లోని కోల్ మైన్ కార్యాలయంలో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 50మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.