Top Headlines : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు .. ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి

ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈక్రమంలో శంషాబాద్‌లో రాహుల్‌కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లో ఏం రాసి ఉందంటే..

Headlines-11am

ఊరిస్తున్న వరాలు..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎన్నికల మ్యానిఫెస్టో ఖర్గే విడుదల చేయనున్నారు.  అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీంట్లో భాగంగా మల్లికార్జున ఖర్గే ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

రాములమ్మ కాంగ్రెస్‌ కండువా..
బీజీపీకి రాజీనామా చేసిన విజయశాంతి ఈరోజు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన సమక్షంలో రాములమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

రాహుల్ సుడిగాలి పర్యటన..
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్‌లో రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారంటూ రాసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.  తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాహుల్  మరోసారి పర్యటించనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లతో రాహుల్ గాంధీ ఈరోజు అంతా బిజీ బిజీగా గడపనున్నారు. ఈక్రమంలో శంషాబాద్ లో రాహుల్ కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

వరుస సభలతో హోరెత్తిస్తున్న కేసీఆర్‌…
రోజుకు రెండు మూడు సభలతో హోరెత్తిస్తున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ..ఈరోజు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. తనదైన శైలిలో సభల్లో ప్రసంగించనున్నారు.

ప్రచార హోరు..
తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ కృషి చేస్తోంది. దొరలపాలన వద్దు హస్తంతోనే అభివృద్ది సాధ్యమంటు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సొంత నియోజకవర్గాన్ని చేజిక్కించుకునే వ్యూహంలో భాగంగా రేవంత్  కొడంగల్ లో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించనున్నారు.

పట్టాలు పంపిణీ
ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి నూజివీడులో పర్యటించనున్నారు.అసైన్డ్‌, లంక భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.

మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు..
తెలంగాణలో ఓ పక్క ఎన్నికల వేడి,మరోపక్క ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రైస్ మిల్లర్స్, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.

రెయిన్‌ అలర్ట్‌
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండ తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘మిధిలి’ నామకరణం చేశారు. ఈ తుపాను రేపు బంగ్లాదేశ్ తీరం ఖేపురా-మోంగా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిధిలి’ తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు..ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు.

పోల్‌ ఫైట్‌..
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దిమాని నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్యా ఘర్షణలు చోటుచేసుకుంది. ఇది కాస్తా పెరిగి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి చేరుకుంది.

మావోయిస్టుల బరితెగింపు..
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ వేళ మావోయిస్టుల దాడులకు తెగబడ్డారు. భద్రతాదళాలే టార్గెట్‌గా అటాక్‌ చేశారు.

ఉక్కిరిబిక్కిరి
ఢిల్లీలో రోజు రోజుకు పెరుతున్న వాయు కాలుష్యం సమస్యాత్మకంగా మారుతోంది. వాయు కాలుష్యంతో నగరవాసులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. గాలి నాణ్యత తగ్గడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉగ్ర వేట ..
జమ్మూకశ్మీర్‌లో సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతాదళాలు ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నాయి.