Strong possibility of no trade deal with EU – PM బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్-ఈయూల మధ్య జరుగుతున్న చర్చలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ యూనియన్‌తో ఎలాంటి ట్రేడ్ డీల్ లేకుండానే బ్రెగ్జిట్ (బ్రిటన్ ఎగ్జిట్) జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ బోరిస్ వ్యాఖ్యానించారు. కాగా, కొన్ని వారాల నుంచి యూకే, ఈయూ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా.. కీలక అంశాలపై ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి రాలేకపోయారు.
డిసెంబర్ 31న చర్చల గడువు ముగుస్తున్న నేపథ్యంలో బోరిస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈయూతో గడువు ముగిసే వరకు చర్చలు కొనసాగుతాయని, అయితే ప్రస్తుత పరిస్థితులు ఒప్పందం కుదరడానికి కనీసం దగ్గరలో కూడా లేవని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. చర్చలపై అంతిమ ఫలితాన్ని స్వాగతించేందుకు ప్రజలు, సంస్థలన్నీ మానసికంగా సిద్ధం కావాలని కూడా బోరిస్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా లాగే.. బ్రిటన్ సైతం ఈయూతో.. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు లోబడి వాణిజ్యం చేసేందుకే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని బోరిస్ వ్యాఖ్యానించారు.
అయితే, కొన్ని వారాల నుంచి యూకే, ఈయూ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా.. కీలక అంశాలపై ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి రాలేకపోయారు. కాంపిటిషన్ నిబంధనలు, చేపల వేట హక్కుల వంటి వాటిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్.. యురోపియన్ కమిషన్ అధ్యక్షడు ఉర్సులా లెయెన్‌తో సమావేశమైనా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. బుధవారం బ్రసెల్స్‌లో బోరిస్ జాన్సన్-ఉర్సులా వాన్ డర్ లియెన్ల మధ్య జరిగిన అత్యవసర సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అయితే రానున్న రోజుల్లో చర్చలను కొనసాగించేందుకు ఇరు వర్గాల నేతలు సుముఖత వ్యక్తం చేశారు.
డిసెంబర్, 31న ఇరు వర్గాల మధ్య వాణిజ్య చర్చలు ముగుస్తున్నందు వల్ల రానున్న రోజుల్లో జరిగే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ఇరు వర్గాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు లోబడి వాణిజ్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
అయితే,బ్రెగ్జిట్ తర్వాత కూడా తన చట్ట పరిధిలోనే బ్రిటన్ ఉండాలని ఈయూ భావిస్తోందని, లేదంటే దిగుమతులపై పన్నులు వేయాలనుకోవడం వంటి చర్యలు ట్రేడ్ డీల్‌ను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయని..యురోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ఉండే అవకాశాలు లేవని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.