Bruce Lee biopic announced by Life of pi director ang lee
Bruce Lee : చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిన హాంగ్ కాంగ్, హాలీవుడ్ నటుడు బ్రూస్లీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. చిన్న వయసులోనే తన మార్షల్ ఆర్ట్స్ తో, అద్భుతమైన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్లీ 32 ఏళ్ళ వయసులోనే మరణించాడు. ఆయన మరణించినా అతని సినిమాలు ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్.
బ్రూస్లీపై ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలు రాగా, తాజాగా మరో బయోపిక్ ని అనౌన్స్ చేశారు. లైఫ్ అఫ్ పై, హల్క్ లాంటి పలు హాలీవుడ్ సినిమాలు తెరకెక్కించి ఆస్కార్ అవార్డులు సాధించిన దర్శకుడు ఆంగ్ లీ బ్రూస్లీ జీవిత కథపై సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. డైరెక్టర్ ఆంగ్ లీ కొడుకు, నటుడు మాసన్ లీ బ్రూస్లీ పాత్ర పోషించబోతున్నాడు. సోనీ సంస్థ మరియు 3000 పిక్చర్స్ సంస్థలు ఈ బయోపిక్ ని నిర్మించనున్నారు. బ్రూస్లీ కూతురు షానన్ లీ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనుంది.
Nani Vs Raviteja : ఈ వారం.. సెల్ఫ్ మేడ్ హీరోల మధ్యే పోటీ.. నాని వర్సెస్ రవితేజ
ఈ సినిమాని ప్రకటిస్తూ దర్శకుడు ఆంగ్ లీ.. బ్రూస్ లీ కథ ప్రపంచానికి తెలియాల్సింది ఎంతో ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా మీద పరిశోధన చేస్తున్నాను. ఇది నా డ్రీం ప్రాజెక్టు. దీంట్లో బ్రూస్లీ విజయాలు, కష్టాలు అన్ని ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాని మొదలుపెడతాను, అంటూ బ్రూస్లీ గొప్పతనం గురించి మాట్లాడారు.