Pak Drone : భారత్ – పాక్ బోర్డర్, మరో డ్రోన్ కలకలం

భారత్ -పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టార్‌లోకి డ్రోన్‌ దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో డ్రోన్ పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్లిపోయింది.

Bsf Fired At Suspected Pak Drone

Pak Drone BSF Fired : భారత్ -పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టార్‌లోకి డ్రోన్‌ దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో డ్రోన్ పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్లిపోయింది. రాత్రి 9 గంటల 52 నిమిషాల సమయంలో డ్రోన్ భారత భూభాగంలోకి వచ్చినట్టు బీఎస్‌ఎఫ్ (BSF) ప్రకటించింది.

రెండు వారాల నుంచి కలకలం : –
రెండు వారాల నుంచి భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. జూన్ 27న తొలిసారిగా.. బోర్డర్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌ఫోర్ట్‌పై డ్రోన్లతో దాడి జరిగింది. డ్రోన్లను ఉపయోగించి పేలుడు పదార్ధాలను జారవిరిచారు. ఆ తర్వాత కూడా వివిధ సెక్టార్‌లలో డ్రోన్లు సంచరించాయి. సరిహద్దుల్లోకి ఆయుధాలను, డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని అనేక జిల్లాల్లో డ్రోన్ల వినియోగంపై ఇప్పటికే నిషేధం అమలవుతోంది.

ఉగ్రవేట : –
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది పుల్వామా టౌన్‌లో భారీ కుట్రకు ప్లాన్ చేసిన మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. చనిపోయిన వారిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్… ఐజాజ్‌ అలియాస్… అబు హురైరా కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా టౌన్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న బలగాలు… మంగళవారం రాత్రి నుంచే సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.