BSNL New Recharge Plans : ప్రముఖ దేశీయ ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ప్రీపెయిడ్ ఆఫర్ ప్రకటించింది. BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL new prepaid recharge plans) ప్రవేశపెట్టింది. ఈ రీచార్జ్ ప్లాన్లపై భారీ డేటాతో పాటు ఇతర అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. కస్టమర్లు నెలవారీ ప్రాతిపదికన మొత్తం 75GB డేటాను పొందవచ్చు. కొత్త ప్లాన్ 300 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే.. ప్రాథమికంగా ఈ ప్లాన్ దాదాపు 9-10 నెలల వరకు వ్యాలిడిటీ అవుతుంది. BSNL అందించే ప్రీపెయిడ్ దీర్ఘకాలిక ప్లాన్ ధర రూ. 2,022గా ఉంటుంది.
BSNL పోర్ట్‌ఫోలియోకు కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ను జోడించింది. దీని ధర రూ. 2,022గా నిర్ణయించింది. ఈ ప్లాన్ ద్వారా నెలకు 75GB డేటాను అందిస్తుంది. ఈ డేటా బెనిఫిట్స్ 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత యూజర్లు తమ డేటా వోచర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డేటాను పూర్తి చేసిన తర్వాత.. డేటా స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMSలను పొందుతారు. AzadiKaAmritMahotsavPV_2022లో భాగంగా BSNL ఈ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ (BSNL prepaid recharge Offers)ని రిలీజ్ చేసింది. అలాగే డేటా లిమిట్ టైం ఆఫర్ మాత్రమే.. ఆగస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ అందించే అనేక ప్లాన్లలో BSNL STV 228 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 2GB డెయిలీ డేటాతో వస్తుంది. మీరు అందించిన డేటాను పూర్తి చేసిన తర్వాత.. స్పీడ్ డేటా 80Kbpsకి తగ్గిపోతుంది. ఒకరికి రోజుకు 100 SMS కూడా వస్తుంది. BSNL రూ. 239 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. రూ. 10 టాక్‌టైమ్ అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటుంది. కస్టమర్లు రోజుకు 2GB డేటా, 100 SMSలను కూడా పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే.. మీరు అందించిన మొత్తం డేటాను వాడేసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80Kbpsకి తగ్గిపోతుంది.
Read Also : BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..