Fire in Bus : టూరిస్టు బస్సులో మంటలు.. 12 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనం

బల్గేరియాలో ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగి 12మందిచ చిన్నారులతో 45మంది సజీవ దహనమైన దుర్గటన బర్గేరియాలో చోటుచేసుకుంది.

Tourst Bus Caught In Fire

Bulgaria bus crash:  ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగి 45మంది సజీవ దహనమైన దుర్గటన బర్గేరియాలో చోటుచేసుకుంది. యూరప్ దేశమైన బల్గేరియాలో సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. దీంతో బస్సులోంచి బయపడలేక 45మంది పర్యాటకులు దుర్మణంపాలయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం దగ్థమైపోయింది.

బల్గేరియాలో 45 మంది టూరిస్టులతో వెళుతున్న ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 45మంది సజీవ దహనం అయ్యారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలి పూర్తిగా దగ్థమైపోయింది.

ఈ ఘటనలో 45 మంది మరణించగా..ఏడుగురు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం మరింత బాధకలిగించే విషయం. పూర్తిగా కాలిపోవటం వల్ల మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో మంటలు వ్యాపించటానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.