Minister Nitin Gadkari : మంత్రులు ఏం చెప్పినా అధికారులు ‘ఎస్ సార్’ అనాల్సిందే‘

మంత్రులు ఏం చెప్పినా అధికారులు ‘yes sir’ అని మాత్రమే అనాలి’ అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి వ్యాఖ్యానించారు.

bureaucrats should only say ‘yes sir to ministers : ‘మంత్రులు ఏం చెప్పినా అధికారులు ‘yes sir’ అని మాత్రమే అనాలి’ అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఆగస్టు 9,2022) నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గడ్కరి..మంత్రులు ఏం చెప్పినా చేయడానికి ప్రభుత్వాధికారులు సిద్ధంగా ఉండాలని..మేము ఏం చెప్పినా అధికారులు కేవలం yes sir మాత్రమే అనాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చెప్పింది అమలు చేయడానికి అధికారులు రెడీగా ఉండాలని అన్నారు.

అంతేతప్ప బ్యూరోక్రాట్లు ( ప్రభుత్వ అధికారులు) చెప్పినట్లు ప్రభుత్వాలు నడువవని..తాము (మంతులు) చెప్పినట్లే నడుస్తాయని అన్నారు. అధికారులు కేవలం ఎస్సార్‌ అని మాత్రమే అనాలి. మేం చెప్పింది తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే అని అన్నారు. ఇతర బీజేపీ నేతల కంటే కాస్త భిన్నంగా ఉండే నితిన్ గడ్కరి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా గడ్కరి మాట్లాడుతూ..మహాత్మాగాంధీని ఉటంకిస్తూ.. పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదని..అలా అడ్డుపడే చట్టాన్ని 10సార్లు ఉల్లంఘించాల్సి వస్తే.. దానికి మనం వెనుకాడకూడదని సూచించారు.1995లో గాదరిచోలి, మేల్‌ఘాట్‌లో పౌష్టికాహార లోపంతో వేలాది మంది గిరిజన పిల్లలు చనిపోయారని..గ్రామాలకు రోడ్లు లేవని, రోడ్ల అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డు వస్తున్నాయని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు