India vs Newzealand Match: రెండోవన్డేకు సంజూశాంసన్‌ను ఎందుకు తీసుకోలేదో చెప్పిన కెప్టెన్ శిఖరధావన్

తొలిమ్యాచ్‌లో సంజూ శాంసన్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా, ఆదివారం రెండో వన్డేలో కూడా సంజూశాంసన్‌ తుది జట్టులో ఎంపిక కాలేదు. దీంతో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. శాంసన్‌ను తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

India vs Newzealand Match: కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ లోభాగంగా ఆదివారం హమిల్టన్‌లో రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో న్యూజీలాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఆక్లాండ్‌లో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. తొలిమ్యాచ్‌లో సంజూ శాంసన్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా, ఆదివారం రెండో వన్డేలో కూడా సంజూశాంసన్‌ తుది జట్టులో ఎంపిక కాలేదు.

India vs New Zealand Match: వర్షం ఎఫెక్ట్.. న్యూజీలాండ్ వర్సెస్ టీమిండియా రెండవ వన్డే రద్దు ..

తొలి వన్డేలో సంజూను పక్కనపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. రెండో వన్డేలోనూ ఎంపిక చేయకపోవటంతో, అతని స్థానంలో దీపక్ హుడాను భారత జట్టులోకి తీసుకురావడంతో ఈ నిర్ణయం పట్ల ట్విటర్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రధాన కోచ్ VVS లక్ష్మణ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. శాంసన్‌ను తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

India vs New Zealand: టీమిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఓటమిపై శ్రేయాస్ అయ్యర్

రెండో వన్డేలో మేము ఆరో బౌలర్‌ను తీసుకోవాలని అనుకున్నాం. ఈ కారణంగానే సంజు శాంసన్‌ను తుదిజట్టులోకి తీసుకోలేక పోయామని, ఆయన స్థానంలో దీపక్ హుడాను ఎంపిక చేయడం జరిగిందని ధావన్ తెలిపాడు. బంతిని బాగా స్వింగ్ చేయగలడు కాబట్టి చాహర్ ఎంపికయ్యాడని ధావన్ వివరణ ఇచ్చాడు. ఇదిలాఉంటే బుధవారం జరిగే మూడో వన్డేలోనూ టీమిండియా జట్టు రెండో వన్డే ఫార్ములానే అమలుచేస్తే ఆ వన్డేలోనూ సంజూ శాంసన్‌కు చోటు దక్కటం కష్టమే.

ట్రెండింగ్ వార్తలు