Car
Viral Video : మీడియా రిపోర్టర్లు వివిధ అంశాలపై లైవ్ కవరేజ్ ఇస్తుంటారు. వారు ఏం అంశానైతే ఎంపిక చేసుకుంటారో దానిపై మాట్లాడేందుకు ఆయా ప్రాంతాలనే తమ రిపోర్టింగ్ కోసం వేదికగా చేసుకుంటారు. అక్కడ నుండే దారాళంగా మాట్లాడుతూ తాము చెప్పాలనుకుంటున్న అంశాలను వివరిస్తుంటారు. అలా లైవ్ ఇస్తున్న క్రమంలో రిపోర్టర్లకు అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇదే తరహా అనుభం యూఎస్ లోని ఓ రిపోర్టర్ కు ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూఎస్ లోని ఇల్లినాయిస్ స్టేట్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున నిలబడి దాని యొక్క ప్రాధాన్యత గురించి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వటం ప్రారంభించాడు. అతను రిపోర్టింగ్ ఇస్తున్న క్రమంలో అతని వెనుకనున్న ఓకారు సరస్సులోని నీటిలోకి నిదానంగా జారుకుంటూ వెళ్ళిపోయింది. క్షణాల వ్యవధిలోని అది మునిగిపోసాగింది.
ఈ విషయాన్నిగమనించిన రిపోర్టర్ చాకచక్యంగా పక్కకు తప్పుకుని కారు మునిగిపోతున్న దృశ్యాలను చిత్రీకరించమని తన కెమెరామన్ కు సంకేతాలు ఇస్తాడు. దీంతో కెమెరామన్ కారుమునిగిపోతున్న దృశ్యాలను చిత్రీకరిస్తాడు. ప్రస్తుతం ఈ విడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ ఫుట్ బాల్ రైటర్ బ్రియన్ ఫ్లోయిడ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయటంతో అభిమానులు షేర్ లు, లైకులతో ముంచెత్తుతున్నారు. లైవ్ రిపోర్టింగ్ ఇస్తూ చాకచక్యంగా కారు మునిగిపోయే దృశ్యాలు చిత్రీకరించమని చెప్పటం రిపోర్టర్ చాకచక్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
?????? pic.twitter.com/Uah0acNmeD
— Brian Floyd (@BrianMFloyd) August 4, 2021