World Cartoonist Day 2023 : నవ్వును పుట్టించడం చాలా కష్టం.. అదే కార్టూనిస్టు గొప్పతనం.. ఈరోజు ప్రపంచ కార్టూనిస్టు డే..

నవరసాల్లో ఏదైనా ఈజీనేమో.. నవ్వును తెప్పించడం చాలా కష్టం. నటులు తమ నటనతో నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కానీ కార్టూనిస్టులు గీసే గీతలతో నవ్వును పుట్టించడం అంతే అంత సులభం కాదు. అలాంటి కళాకారులంతా ఈరోజు జరుపుకునే వేడుక ప్రపంచ కార్టూనిస్టు డే.

 World Cartoonist Day 2023

World Cartoonist Day 2023: నవ రసాల్లో హాస్యం పుట్టించడం చాలా కష్టం అంటారు.. నిజమే అనిపిస్తుంది. ఒక కార్టూన్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం. అంటే ఆ కార్టూన్ గీసిన కార్టునిస్టు గొప్పతనం. అతని క్రియేటివిటీ. ఆ కార్టూన్ లో పండిన హాస్యం. ఈరోజు వరల్డ్ కార్టూనిస్ట్ డే.

Laughter : నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందా?…

చరిత్ర ప్రకారం చూస్తే 1995 నుంచి ప్రపంచ కార్టూనిస్టు డేని నిర్వహిస్తూ వస్తున్నారట. అప్పట్లో న్యూయార్క్ వరల్డ్ పేజీల్లో మొట్టమొదటి కమర్షియల్ కార్టూన్ వేసారట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గుస్ ఎడ్సన్, ఒట్టో సోగ్లో, క్లారెన్స్ డి. రస్సెల్, బాబ్ డన్ వంటి గొప్ప కార్టూనిస్టులు యుద్ధ సమయంలో కార్టూన్లతో సైనికుల్ని అలరించాలని నిర్ణయించుకున్నారట. 1946లో నేషనల్ కార్టూనిస్ట్స్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు చార్లెస్ షుల్జ్, వాల్ట్ డిస్నీ, డాక్టర్ స్యూస్ వంటి ప్రముఖ కార్టూనిస్టులను గుర్తు చేసుకుంటారు.

Laughter : నవ్వుకు రోగాలను తగ్గించే శక్తి ఉందా?

ఒక కార్టూన్ నవ్వు పుట్టిస్తుంది. ఒక కార్టూన్ ఆలోచన కలిగిస్తుంది. మరొక కార్టూన్ చర్చకు దారి తీస్తుంది. ఒక కార్టూన్ వేయడంలో ఇన్ని భావాలు కనిపించడానికి కార్టూనిస్టు ఎంతో శ్రమ పడతాడు. ఇక సందర్భాన్ని బట్టి ఎన్నో కార్టూన్లు పుట్టుకొస్తుంటాయి. కొన్ని సామాజిక మార్పును ప్రేరేపిస్తే.. కొన్ని వ్యంగ్యాన్ని జోడిస్తాయి. ఏ కార్టూన్ గీసిన అందులో ఆ కార్టూనిస్టు ప్రతిభ, కృషి, అంకిత భావం కనిపిస్తుంది.

Laughter : నవ్వు మీ జీవితంలో ఎలా సహాయపడుతుందంటే!

కార్టూనిస్టులు సమాజానికి ఓ రకంగా సేవ చేస్తున్నారు. ఎన్నో అంశాలను తమ కార్టూన్ల ద్వారా ప్రశ్నిస్తూ, ఆలోచింప చేస్తున్నారు. ప్రపంచ కార్టూనిస్టు డే కార్టూనిస్టులంతా వేడుకగా జరుపుకునే రోజు. ఈ కళలో ప్రతిభ చూపించిన కళాకారులను గౌరవించుకునే రోజు. చాలాచోట్ల ఈరోజు కార్టూన్ల పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ చాటిన కార్టూనిస్టులను గౌరవించుకుంటారు. కార్టూనిస్టులకు మరింత గుర్తింపు రావాలని ఈ కళ కలకాలం నిలిచి ఉండాలని మనసారా కోరుకుందాం.