×
Ad

Delhi High court : పచ్చబొట్టు తొలగిస్తేనే ఉద్యోగం ఇస్తామన్న అధికారులు .. కోర్టును ఆశ్రయించిన యువకుడు

న చేతిమీద ఉన్న ‘పచ్చబొట్టు’ ఓ యువకుడికి ఉద్యోగం రాకుండా చేసింది. చేతిమీద ఉన్న పచ్చబొట్టును తొలగించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

  • Published On : November 12, 2022 / 10:03 AM IST

Job will be given only after tattoo is removed

Delhi High court : తన చేతిమీద ఉన్న ‘పచ్చబొట్టు’ ఓ యువకుడికి ఉద్యోగం రాకుండా చేసింది. చేతిమీద ఉన్న పచ్చబొట్టును తొలగించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సదరు యువకుడి చేతిమీద ఉన్న పచ్చబొట్టు ఓ మతపరమైనది కావటం గమనించాల్సిన విషయం. దాన్ని తొలగించుకోవటానికి ఇష్టపడని యువకుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తదితర బలగాల్లో ప్రవేశానికి కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి అనర్హుడిగా ఉన్నత అధికారులు ప్రకటించబడిన సదరు యువకుడు అధికారుల నిర్ణయాన్ని దిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. దీనికి అధికారుల తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ..సెల్యూట్‌ చేయడానికి ఉపయోగించే కుడిచేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని వివరించారు.

దీనికి సదరు యువకుడు వైద్యపరీక్షలోను..ఫిట్ నెస్ పరీక్షలతో పాటు ఈ ఉద్యోగానికి అవసరమైన అన్ని పరీక్షల్లోను తనకు ఎలాంటి లోపాలూ లేవని తేలిందనీ..చేతి మీదున్న పచ్చబొట్టు మాత్రం అభ్యంతరంగా ఉంటే ఆ పచ్చబొట్టును చిన్నపాటి లేజర్‌ శస్త్రచికిత్సతో తొలగించుకుంటానని అస్సాంకు చెందిన సదరు పిటీషనర్ కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో కోర్టు కూడా పిటీషనర్ వాదనలు విని అంగీకరించింది. రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకొని కొత్త వైద్యపరీక్షలకు బోర్డు ముందు హాజరుకావడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు స్పష్టంచేసింది.. నియామకానికి అర్హుడని వైద్యబోర్డు నిర్ధరిస్తే, చట్టానికి అనుగుణంగా అతడిని రిక్రూట్‌ చేసుకోవాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది.