Centre Law Commission Of India : 4 ఏళ్ల తర్వాత ‘లా కమిషన్’ ఏర్పాటు చేసిన కేంద్రం, చైర్ పర్సన్‌గా కర్ణాటక హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రీతూరాజ్ అవస్థి

కేంద్రం ప్రభుత్వం లా కమిషన్‌‌ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్‌గా నియమించింది.

Centre Constitutes Law Commission Of India After 4 Years, Appoints Justice RR Awasthi As Chairperson

Centre Constitutes Law Commission Of India : కేంద్రం ప్రభుత్వం లా కమిషన్‌‌ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్‌గా నియమించింది. లా కమిషన్ సభ్యులుగా..కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి శంకరన్, ప్రొ. కమిషన్ సభ్యులుగా ఆనంద్ పలివాల్, ప్రొఫెసర్ డిపి వర్మ, ప్రొ.రాకా ఆర్య,శ్రీ ఎం. కరుణలను నియమించింది.

కాగా..21వ కమిషన్ ఛైర్‌పర్సన్ గా..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ చౌహాన్ పదవీ విరమణ చేసిన తర్వాత..ఆగస్టు 31, 2018 నుండి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉంది. దీంతో లా కమిషన్ ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని..వెంటనే నియమించాలని గతంలో న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం లా కమిషన్ ను ఏర్పాటు చేసింది.

కాగా.. కర్ణాటక హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ అవస్థి హిజాబ్ నిషేధంపై కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించారు. జస్టిస్ అవస్థి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి హిజాబ్ వివాదంపై కీలక తీర్పునిచ్చారు. ఆ తరువాత జస్టిస్ అవస్థి జూలై 3, 2022న పదవీ విరమణ చేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనమైన హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (అప్పటి సీజేగా ఉన్న అవస్థి) జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌, జస్టిస్‌ జైబున్నీసా ఎం వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం..హిజాబ్‌ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.