Nandamuri Family: ఒకేవేదికపై చంద్రబాబు, దగ్గుబాటి.. ఆప్యాయంగా పలకరింపులు!

నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పెళ్లిళ్లు అయినా అల్లుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారు.

Nandamoori Family

Nandamuri Family: నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పెళ్లిళ్లు అయినా అల్లుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారు. ఆ మాటకొస్తే నందమూరి కుటుంబ వారసులకు సంబంధాలు చూడడంలో పూర్తి బాధ్యతలను తీసుకుంటారు. ముఖ్యంగా చంద్రబాబు ఇలాంటి విషయాలలో అన్నీ తానై వ్యవహరిస్తారు. అటు పురంధేశ్వరి, ఇటు భువనేశ్వరి కూడా శుభకార్యాలు, వేడుకలలో ఇంటి ఆడపడుచులుగా ముందుంటారు. అయితే, దగ్గుబాటి-నారా కుటుంబాల మధ్య సఖ్యత ఉండదన్నది రాజకీయ వర్గాల మాట.

Nandamuri Family

ఎన్టీఆర్ చేతుల నుండి టీడీపీ చేతులు మారే సమయంలో చంద్రబాబు, వెంకటేశ్వరరావు కలిసే ఉన్నారు. కానీ.. ఆ తర్వాత రాజకీయ కారణాలతో దగ్గుబాటి కుటుంబం టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం.. వెంకటేశ్వరావు ఎమ్మెల్యేగా.. పురంధేశ్వరి ఎంపీగా, కేంద్రమంత్రిగా పదవులను దక్కించుకోడం.. ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీలో ఉండగా.. వెంకటేశ్వరావు వైసీపీలో చేరారు. అయితే.. ప్రస్తుతం ఆయన యాక్టివ్ గా కనిపించకపోగా సొంత గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులతో పాటు ఎక్కువగా గ్రామానికే పరిమితమై ఉంటున్నారు.

Nandamuri Family1

కాగా.. రాజకీయపరంగా పరస్పర విరుద్ధంగా కనిపించే చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు. అది కూడా ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను ఈ మూడు కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకలో దగ్గుబాటి-నారా కుటుంబాలు హైలెట్ గా నిలిచాయి. వెంకటేశ్వరరావు, చంద్రబాబు తోడల్లుళ్లుగా స్పెషల్ అట్రాక్షన్ గా మారగా.. పురంధేశ్వరి-భువనేశ్వరి ఈ వేడుకను అన్నీ తానై జరిపించారు.

Nandamuri Family2